

గూడూరు , మన న్యూస్:- ఐ.టి టు పాయింట్ ఓ రోల్ అవుట్ లో భాగంగా మంగళవారం గూడూరు డివిజన్ మైగ్రేట్ అవడం జరిగిందని,ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించే దిశగా తపాలా శాఖ ముందుకెళుతుందని గూడూరు డివిజన్ సూపరిడెంట్ ఎల్.వి మురళీ కుమార్ తెలిపారు.గూడూరులోని ప్రధాన తపాలా కార్యాలయంలో ప్రారంభించిన అనంతరం వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే ధ్యేయం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎ.ఎస్పీ మణిగంధన్,పోస్టుమాస్టర్ షేక్ నజీముద్దీన్, ఐపి సుధీర్ బాబు,కిరణ్ కుమార్ నాయక్,సురేష్,ఫైరోజ్ తదితరులు పాల్గొన్నారు.