

పంబలేరు వంతెన నిర్మాణాన్ని పూర్తి చేస్తాం- గూడూరులో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో రోడ్డు, భవనాల శాఖ మంత్రి వెల్లడి
గూడూరు, మన న్యూస్ :- రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం సమానంగా అందించాలనే దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖా మంత్రి బీసీ. జనార్దన్ రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జనార్దన్ రెడ్డి కాలనీలో
సుపరిపాలన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడకెళ్లినా తల్లికి వందనం, ఫించన్ల పంపిణీ వంటి సంక్షేమ పథకాల అమలుతో ప్రజల కళ్లల్లో ఆనందాన్ని చూడగలుగుతున్నామన్నారు. టీడీపీది ప్రజా సంక్షేమం అయితే వైసీపీది రౌడీల సంక్షేమం అన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా వచ్చిన దాఖలాలు లేవన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ముందుకొస్తున్నాయన్నారు. ఏడాది కాలంలోనే పరిశ్రమల స్థాపనతో లక్షలాదిమంది నిరుద్యోగు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.
