మన న్యూస్,తిరుప‌తిః– హరిహర వీరమల్లు సినిమా భారీ సక్సెస్ సాధిస్తుందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో హరిహర వీరమల్లు ఘన విజయం అందుకోవాలని అలిపిరి శ్రీవారి పాదాల వద్ద సోమ‌వారం సాయంత్రం కొబ్బరి కాయలు కొట్టి శ్రీవేంకటేశ్వర స్వామిని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జనసైనికులు మొక్కుకున్నారు. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ అయ్యాక విడుదల అవుతున్న తొలి చిత్రం హరిహర వీరమల్లు అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. ఈ సినిమా ద్వారా గొప్ప మెసేజ్ ప్రజలకు పవన్ కళ్యాణ్ ఇవ్వనున్నారని ఆయన తెలిపారు. జన శ్రేణులతో పాటు మెగా ఫ్యాన్స్ సినిమా సక్సెస్ లో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక సినిమాలు త‌గ్గించుకున్న‌ప్ప‌టికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ప్యాన్స్ క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని ఆయ‌న చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షులు రాజా రెడ్డి, కార్పొరేటర్లు సీకే రేవతి, దూది కుమారి, శైలజ, యాదవ కృష్ణా, దూది శివ, ఆకేపాటి సుభాషిణి, డాక్టర్ ఆకుల వనజ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *