

గూడూరు, మన న్యూస్ :- గత 13 ఏళ్లు గా అసంపూర్తి గా ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులు రెడ్డి డిమాండ్ చేశారు.సోమవారం గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. అనంతరం సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా కి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2009 వ సంవత్సరం లో అనాటి సీఎం డాక్టర్ వై. ఎస్.రాజశేఖర్ రెడ్డి గూడూరు ఫ్లై ఓవర్ కి నిధులు మంజూరు చేశారు అన్నారు. కాంగ్రెస్ హయాంలో తప్ప మిగతా టీడీపీ, వై. సి.పి ప్రభుత్వాలు ఫ్లై ఓవర్ ను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. 90 శాతం పూర్తి అయిందని , మిగతా పది శాతం పనులు త్వరిత గతిన పూర్తి చేసి, ప్రజలకు వినియోగంలోకి తేవాలని పేర్కొన్నారు.గూడూరు ఒకటవ , రెండో పట్టణ లకు నిత్యం 25 వేల మంది ప్రయాణిస్తుంటారని తెలిపారు.
పట్టణ ప్రజలు , వ్యాపారస్థులు , విద్యార్థులు త్వరిత గతిన ఫ్లై ఓవర్ ను పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రావూరు బ్రహ్మయ్య, సుబ్బరాజు , చిల్లకూరు వేమయ్య, బాలాజీ , తదితరులు పాల్గొన్నారు.