కార్మికులు డిమాండ్లు పరిష్కారం అయ్యేంతవరకు తగ్గేదే లేదు.సి.ఐ.టి.యు

గూడూరు, మన న్యూస్ :- మున్సిపల్ కార్మికులు దీర్ఘకాలికంగా నోచుకోని పలు సమస్యలు,కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఇవ్వాల్సిన జి. ఓ.లును ఇచ్చి పరిష్కారం చేసేంతవరకు తగ్గేదే లేదని, మున్సిపల్ కార్మికులు, సి.ఐ.టి.యు నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరులో రాష్ట్ర,జిల్లా కమిటీ సభ్యులకు మేరకు ఏ.పీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్, పారిశుధ్య కార్మికులు తమ సమస్యల పరిష్కారం కొరకు సమ్మె లోనికి వెళ్లి శనివారానికి “ఏడవ రోజు”కు చేరుకుంది. అదే బాటలో పారిశుధ్య కార్మికులు సమ్మె బాట పట్టి “నాలుగు రోజులకు” చేరుకుంది. నాయకులు మాట్లాడుతూ పాలకవర్గాలు చేస్తున్న ప్రయత్నాలను ఎదుర్కొని కార్మికులు పట్టుదలతో పోరాటాలు కొనసాగిస్తున్నారని, కూటమి ప్రభుత్వం అధికారం లోనికి వచ్చి ఏడాది దాటి పోయిందని, గడచిన ఏడాది కాలంలో మున్సిపల్ ఫెడరేషన్ నాయకత్వం స్వయంగా ముఖ్యమంత్రి,మంత్రులను, అధికారులను,కలిసి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేసిందని వారు తెలియజేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కార్మికులు సమ్మె బాట పట్టాల్సి వచ్చిందని, ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఇంజనీరింగ్,పారిశుధ్య కార్మికుల వారి డిమాండ్లకు వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి దారా. కోటేశ్వరరావు,గౌరవాధ్యక్షులు జోగి శివకుమార్, భూలోకం మురళి, బి.రమేష్, గూడూరు మని,చంగనపల్లి.మహేష్,కె. నారాయణమ్మ,డి.మణమ్మ, గుర్రం.రమణయ్య,పామంజి మణి,బి.వి.రమణయ్య, ఓ. వరలక్ష్మి,ఎస్. కామేశ్వరరావు,సి.హెచ్. సుబ్బారావు, ఎస్.కె.నయీమ్,కె. పోలయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..