

గూడూరు, మన న్యూస్ :- ఏఐటియుసి అనుబంధం గ్రామ వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ 5 ఆధ్వర్యం లో జరుతున్న చలో విజయవాడ పోస్టర్లను గూడూరు డివిజన్ నాయకులు మధిర బాలయ్య గోగినేనిపురం లోని EE కార్యాలయం దగ్గర ఆవిష్కరించారు కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖ లో పాత ఉద్యోగులు చేస్తున్న పని ఎనర్జీ అసిస్టెంట్ JLM గ్రేడ్ 2 లు చేస్తున్న పని ఒకటే అయినప్పుడు పాత కొత్త ఉద్యోగుల మధ్య రెండు రకాల సర్వీస్ రూల్స్ రాజ్యాంగం లోని ఆర్టికల్ 14 మరియు 16 (సమానత్వ నిబంధనలు) ప్రకారం చట్ట విరుద్ధం అన్నారు. కావున నూతన సర్వీస్ రూల్స్ రద్దు చేసి పాత సర్వీస్ రూల్స్ ప్రకారం పదోన్నతులు కల్పించి ఇతర హక్కులు కల్పించాలన్నారు నూతన సర్వీస్ మూలంగా తమ విలువైన జీవితాలను భవిష్యత్తులో కోపోతున్నామన్నారు. అదేవిధంగా మెడికల్ కన్వేయన్స్ సిటీ మరియు సైకిల్ అలవెన్స్ లు పాత బకాయిలు చెల్లించాలన్నారు. ఈపిడిసిఎల్ చీపురుపల్లి ఆర్ఈసిఎస్ పరిధిలో పనిచేస్తున్న పని చేస్తున్న JLM లకు ప్రొబేషన్ ప్రకటించి పే స్కేల్ ఇవ్వాలన్నారు అలాగే సచివాలయం లో పని చేస్తున్న ఇతర ఉద్యోగులు మాదిరి గానే ఎనర్జీ అసిస్టెంట్ JLM గ్రేడ్ 2 లకు కూడా సెలవులు ఇవ్వాలన్నారు. అలాగే 21.07.25 సోమవారం చలో విజయవాడ కార్యక్రమన్ని జయప్రదం చేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో జస్వంత్, జి.సీను, బి.సీను, శివ నరేష్, సందని తుడుతరులు పాల్గొన్నారు.