

శంఖవరం మనన్యూస్ ప్రతినిధి:- ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, జిల్లా సహకార బ్యాంకులకు పాలక మండళ్ల నియామకాలకు ఎన్.డిడి.ఎ. కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సహకార సంఘాలకు పాలక మండళ్ళ నియామకాల ప్రక్రియను జూలై నెలాఖరు నాటికి పూర్తి చేయాలని భావించిన ప్రభుత్వం విడతల వారీగా నియామకాలను చేపడుతున్నది. వాస్తవంగా పాలక మండళ్ల పదవీ కాలం 2018 తోనే ముగిసింది. 2018 లో అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం సహకార సంఘాలకు ఎన్నికలను నిర్వహించకుండా కేవలం త్రీ మెన్ కమిటీల పేరుతో నామినేటెడ్ విధానంలో పాలక మండళ్లను ఏర్పాటు చేసింది. ఈ నేపధ్యంలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో రెండో దఫాలో 5 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు అధ్యక్షులను, సభ్యులను ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిన వివరాలను ఎమ్మెల్యే సత్యప్రభ ఇటువలే మీడియాకు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎన్.డి.ఏ. కూటమిలోని తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలకు సమానం ప్రాతినిధ్యం కల్పిస్తూ నూతన పాలకవర్గ సభ్యులు ఎంపిక చేసామని ఆమె వెల్లడించారు. నూతన పాలక వర్గ సభ్యులు అందరికీ అభినందనలు తెలిపారు. కత్తిపూడిలోని ది కత్తిపూడి కర్షక సేవా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఛైర్ పర్సన్ గా గౌబు కృష్ణమూర్తి, సభ్యులుగా శరణం జయబాబు, పట్టెం సత్తిబాబు నియమితులు అయ్యారు. ఈ సందర్భంగా కత్తిపూడి కర్షక సేవా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం. ఛైర్ పర్సన్ గా గౌబు కృష్ణమూర్తి, సభ్యులుగా నియామకమైన శరణం జయబాబు ను శంఖవరం మండలం జనసేన పార్టీ నాయకులు కరణం సుబ్రహ్మణ్యం, గాబు సుభాష్, తలపంటి బుజ్జి మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువాలు పూలదండలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ, రైతులకు అందుబాటులో ఉంటూ విలువైన సేవలను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంగాధర్ ,కిరణ్,కీర్తి కుమార్,కొయ్య శ్రీను ,ప్రవీణ్,గౌతు బుజ్జి, పిల్లి దుర్గ మరియు అధిక జనసైనికులు పాల్గొన్నారు.