

గూడూరు, మన న్యూస్ :- చిట్టమూరు మండలం :- చిట్టమూరు నుండి ప్రజల సౌకర్యార్ధం పలు ప్రాంతాలకు నూతన సర్వీస్ లను ప్రారంభించిన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ మాట్లాడుతూ….
గతంలో మండలం నందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైనపుడు ప్రజలు కలసి దూర ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేదని కలసి తెలిపారు. RM / DM గార్లకు తెలిపిన వెంటనే ఈ రోజు సర్వీస్ లను కేటాయించారు. వాకాడు నుండి మల్లాం వయా పూలతోట మీదుగా చెన్నై వరకు మల్లాం నుండి తిరుపతి వరకు విద్యార్థుల కోసం కొక్కుపాలెం నుండి మల్లాం వరకు ఒక సర్వీస్ లను ప్రారంభించాము అని అన్నారు.
గత ప్రభుత్వం లాగ మాయమాటలు చెప్పే ప్రభుత్వం కాదు కూటమి ప్రభుత్వం, చెప్పిన వన్ని చేస్తున్నాం అని తెలిపారు.
