

శ్రీకాళహస్తి, Mana News :- భారత స్వాతంత్ర్యోద్యమంలో ప్రధాన భూమిక పోషించి, స్వాతంత్ర్య సమపార్జనకు ఒక సాధనంగా నిలిచిన చేనేత రంగానికి చంద్రబాబు గారి ప్రభుత్వం చేయూత అందించి ఆదుకుంటోందని తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్యోద్యమంలో అహింసాయుత ఉద్యమానికి నాంది పలికిన చేనేత రంగం యొక్క ఔన్నత్యాన్ని గౌరవించి, సాంప్రదాయిక చేనేత పరిశ్రమకు అండగా నిలుస్తున్న ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు కి, పవన్ కళ్యాణ్ కి, లోకేష్ బాబు కి, సుధీర్ రెడ్డి కి స్థానిక పద్మశాలి పేట లోని పలువురు నేతన్నలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు,లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 7వ తేదీ నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనున్నారని,ఈ పథకంలో చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, పవర్లూమ్ మగ్గాలకు 500 యూనిట్లు విద్యుత్ ఉచితం అని తెలిపారు. చేనేత కార్మికులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవసరమైన మద్దతును అందించి, అండగా నిలవాలనే ఉద్దేశంతో గతంలో టిడిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన థ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని ఆగష్టు మొదటివారంలో పునరుద్దరించనున్నట్లు తెలిపారు. చేనేత సహకార సంఘాలలో సభ్యులుగా ఉన్న లక్షలాది చేనేత కార్మికులకు బహుళ ప్రయోజనకరంగా ఉండే త్రిఫ్ట్ పథకానికి సంబంధించిన నిధులను జాతీయ చేనేత దినోత్సవం నాడు విడుదల చేస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వన్నియకుల క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, తెలుగుదేశం పార్టీ బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, క్లస్టర్ ఇన్‌ఛార్జి పేట బాలాజీ రెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మునిరాజా యాదవ్, తిరుపతి పార్లమెంటు నాయకుడు రామచంద్రయ్య, సయ్యద్ చాంద్ బాషా, జాఫర్, ఈశ్వరయ్య, చలమయ్య, కుమారస్వామి, మునిరాఘవులు, రాజయ్య, రమణయ్య, క్రిష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.