

పంచాయతీ కేంద్రానికి మూడు కిలోమీటర్లు దూరంలో పాఠశాల ఏర్పాటు-బడి విలీన ప్రక్రియను విరమించుకోవాలి- రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు
గూడూరు, మన న్యూస్:- రాష్ట్ర ప్రభుత్వం బడుల విలీన ప్రక్రియ తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. చిల్లకూరు మండల పరిధిలోని తూర్పు కనుపూరు పంచాయతీ కేంద్రంలో ఒకటి నుండి 5వ తరగతి వరకు ఉన్న పాఠశాలను మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొమర వారి పాలెం లో ఏర్పాటు చేయడంతో గిరిజన విద్యార్థులు పాఠశాలల వెళ్లకుండా చదువుకు దూరమై గ్రామంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ ఆలయం లో భిక్షాటన చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అందరికీ విద్య కల్పించే విధంగా ఒక వైపు నిర్ణయం తీసుకుంటూ మరోవైపు బడుల విలీన ప్రక్రియ పేరుతో దళితులు గిరిజనులకు చదువుకు దూరం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా గిరిజన కుటుంబాలు తమ బిడ్డలను చదివించుకోవడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో పంచాయతీ కేంద్రంలో ఉన్న పాఠశాలను ఎత్తివేసి ఆ పంచాయతీ పరిధిలోని మూడు కిలోమీటర్ల ఉన్న కొమర వారి పాలెం లో ఏర్పాటు చేయడం భావ్యంగా లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంచాయతీ కేంద్రమైన తూర్పు కనుమూరు గ్రామంలో ఒకటి నుండి 5వ తరగతి వరకు ఉన్న పాఠశాలను కొనసాగించాలని ఆయన కోరారు. పాఠశాలను తూర్పు కనుమూరులో తిరిగి ఏర్పాటు చేయకపోతే గ్రామస్తులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
