

మన న్యూస్ సాలూరు జూలై 13:- పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు సాలూరు నేలిపర్తి బైపాస్ రోడ్ లో గుర్తు తెలియని వాహనం డి కొట్టడంతో పట్టణంలో గొర్లె వీధికి చెందిన గొర్లె ధర్మారావు (43) అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే ధర్మారావు తన కొడుకుతో ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో యాక్టివా పై నేలి పర్తి లో ఉన్న తన పొలంలో ఉన్న పశువులకు దాన పెట్టడానికి తౌడు తీసుకొని వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొనడంతో ధర్మారావు అక్కడికక్కడే మృతి చెందాడు. బండి పై ఉన్న మృతుడు కొడుకు దూరంగా తుళ్ళిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. ఆ అబ్బాయిని సాలూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైపాస్ రోడ్ లో ఏ ఏ వాహనాలు 8 గంటల ప్రాంతంలో ఆ రూట్లో వెల్లాయన్నది సీసీ కెమెరా ఫుటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు.
