

ఉరవకొండ, మన న్యూస్ :ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్, రాయదుర్గం ప్రభుత్వవిప్ కాలువ శ్రీనివాసులు శుక్రవారంపలు అభివృద్ధి పనులను పరిశీలించారు. జిల్లా లోని రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని కనేకల్ మండలం ఎర్రగుంట గ్రామం 137 కిమీ దగ్గర l హై లెవెల్ మెయిన్ కాలువఅండర్ టన్నల్ పనులను వారు పరిశీలించారు. ఈ సందర్బంగా అధికారులను వివరాలు అడిగి తెలుసు కున్నారు.పనులను నాణ్యతతో చేయాలని, వేగవంతం గా చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.