

ఎస్ఆర్ పురం, మన న్యూస్..నా ప్రాణం ఉన్నంతవరకు వైఎస్ఆర్సిపి పార్టీలోనే కొనసాగుతా అని.. కొంతమంది నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని… వీరుఎన్ని అసత్య ఆరోపణలు చేసిన నాలో తుది శ్వాస ఉన్నంతవరకు వైఎస్ఆర్సిపి పార్టీలోనే కొనసాగుతాయని కటికపల్లి సర్పంచ్ మార్కొండయ్య అన్నారు. శుక్రవారం ఎస్ఆర్ పురం మండలం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ లో కటింగ్ పల్లి సర్పంచ్ మార్కొండయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గురువారం గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు కటికపల్లి పంచాయతీలో సుపరిపాలన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నా ఇంటి వద్దకు వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావును స్థానిక సర్పంచ్ గా నేను మర్యాదపూర్వకంగా కలిసి, సాలువుతో సన్మానించడం కానీ కొంతమంది వ్యక్తులు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనకు రాజకీయ బిక్ష పెట్టిన మాజీ మంత్రివర్యులు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి , గంగాధర నెల్లూరు వైఎస్ఆర్సిపి ఇన్చార్జి కృపా లక్ష్మి, చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జి విజయానంద రెడ్డి, రుణపడి ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా క్రియాశీలక కార్యదర్శి కుప్పయ్య, నియోజకవర్గం నాయకుడు సతీష్ తదితరులు పాల్గొన్నారు.