సాలూరులో సి పి ఎం పార్టీ మండల కమిటీలు – సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు

మన న్యూస్, సాలూరు జూలై 11:- సాలూరులో సిపిఎం సమావేశం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు, మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో డోలీలా మోత లేకుండా అన్ని గ్రామాలకి సదుపాయాలు కల్పించాలి కోటియా సరిహద్దు గ్రామాల సమస్యను పరిష్కారం చేయాలి అన్సర్వేడు అటవీ బంజరు భూములకు పట్టాలి ఇవ్వాలి నాన్ షెడ్యూల్ గ్రామాలను షెడ్యూల్ గ్రామాల జాబితాలో చేర్చి ప్రకటించాలని డిమాండ్ చేశారు, రాష్ట్రంలో డోలీలు మోత లేకుండా చూస్తామని రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రయత్నం చేశారని ప్రకటనలకే పరిమితం అయ్యారు తప్ప సమస్య పరిష్కారం కోసం ఎక్కడా చొరవ చూపలేదని తెలిపారు,సాలూరు మండలంలో ఇటీవల కాలంలో కురుకుటి పంచాయతీ ఎగువ కాసాయవలస గ్రామానికి చెందిన కోనేటి సామలమ్మ అనే ఆశా వర్కకు ఆరోగ్యం బాగోలేక డోలి కట్టి సుమారు 5 కిలోమీటర్లు కాలిబాటన తీసుకువస్తే బాధ్యత గల స్థానంలో ఉండి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు బాధ్యతరాహిత్యంగా హేళనగా మాట్లాడటం సరికాదని తెలిపారు కనీసం సదుపాయాలు రోడ్లు లేకుండా రోగులను డోలీలుతో తప్ప మరి ఏ విధంగా తీసుకురావాలో మంత్రిగారి చెప్పాలని కోరారు ఇప్పటికైనా గిరిజన గ్రామాలకు మౌలు సదుపాయాలు కల్పనలో దృష్టి పెట్టాలని కోరారు మండలంలో అటవీ అన్సర్వేడు బంజరు భూములను తరతరాలుగా గిరిజనులు పేదలు సాగు చేసుకుంటున్న నేటికి పట్టాలు ఇవ్వడం లేదని తెలిపారుచేయడం లేదని తెలిపారు కొట్టియా సరిహద్దు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు ఒడిస్సా ప్రభుత్వం గిరిజనుల పైన దాడులకు దౌర్జన్యాలు చేస్తుంటే అడ్డుకోవలసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మౌనంగా ఉండడం సరికాదని శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. సుప్రీంకోర్టు ఇచ్చిన స్టాటిస్కో ను అమలు చేయాలని గిరిజనులకు రక్షణ కల్పించాలని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. రక్షణగా అండగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం సరికాదని తెలిపారు,మండలంలో ఎక్కువ భాగం నాన్ షెడ్యూల్ గ్రామాలుగా ఉన్నాయని వాటిని షెడ్యూల్ గ్రామాలుగా గుర్తించి డిమాండ్ చేశారు. ఆలూరు పట్టణంలో ఏరియా హాస్పిటల్ గా నిర్మాణం అవుతున్న భవనాలను వెంటనే పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొని రావాలని డిమాండ్ చేశారు, లేనియెడల గిరిజనులను పేదలను సమీకరణ చేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు ,కమిటీ సభ్యులు శ్రీధరపు అప్పారావు, గేమ్మెల బాబయ్య ,వంతల సుందర్రావు ,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

టి బి ముక్త భారత్ కి ప్రతి ఒక్కరు సహకరించాలి.అనుమానం రాగానే వైద్య సేవలు పొందాలి.ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైద్యాధికారి ధీరేంద్ర పిలుపు

మన న్యూస్ సింగరాయకొండ:- ఆరోగ్య సంరక్షణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా.ధీరేంద్ర పిలుపు ఇచ్చారు.సింగరాయకొండ చంద్రబాబు నాయుడు కాలనీ లోని ఉమర్…

ఘనంగా కొండేపి నియోజకవర్గం వైసీపీ కార్యకర్తల సమావేశం

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, కొండపి: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు, కొండపి నియోజకవర్గ సమన్వయకర్త డా. ఆదిమూలపు సురేష్ గారి ఆధ్వర్యంలో “బాబు ష్యూరిటీ మోసం – గ్యారెంటీ” పేరుతో నిర్వహించిన విశేష సమావేశం ఘనంగా జరిగింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

టి బి ముక్త భారత్ కి ప్రతి ఒక్కరు సహకరించాలి.అనుమానం రాగానే వైద్య సేవలు పొందాలి.ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైద్యాధికారి ధీరేంద్ర పిలుపు

టి బి ముక్త భారత్ కి ప్రతి ఒక్కరు సహకరించాలి.అనుమానం రాగానే వైద్య సేవలు పొందాలి.ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైద్యాధికారి ధీరేంద్ర పిలుపు

ఘనంగా కొండేపి నియోజకవర్గం వైసీపీ కార్యకర్తల సమావేశం

ఘనంగా కొండేపి నియోజకవర్గం వైసీపీ కార్యకర్తల సమావేశం

మీ ప్రాణం మీ భద్రత .ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి సురక్షిత ప్రయాణం చేయాలి .ఎస్సై నాగమల్లేశ్వర రావు పిలుపు.

మీ ప్రాణం మీ భద్రత .ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి సురక్షిత ప్రయాణం చేయాలి .ఎస్సై నాగమల్లేశ్వర రావు పిలుపు.

కూటమి పాలనలో అర్హులైన వారందరికీ సూపర్ సిక్స్ పథకాలు…

కూటమి పాలనలో  అర్హులైన వారందరికీ సూపర్ సిక్స్ పథకాలు…

ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్.

ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్.

మంత్రి కేశవ -కాలువ అభివృద్ధి పనుల పరిశీలన.

మంత్రి కేశవ -కాలువ అభివృద్ధి పనుల పరిశీలన.