

మన న్యూస్,తిరుపతి : మేజర్ న్యూస్: రాష్ట్రస్థాయి అందుల క్రికెట్ పోటీలు ఫైనల్స్ లో గెలుపొందిన జట్ల క్రీడాకారులకు రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. తుమ్మలగుంట లోని క్రీడా మైదానంలో రెండు రోజులు పాటు జరిగిన అందుల రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు బుధవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న, గెలిస్తే రెండవ తరానికి గుర్తుండేలా ఈ తరానికి ఏదైనా చేద్దామని పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్తడేను పురస్కరించుకొని అందుల టోర్నమెంటుకు లక్ష రూపాయలు బహుమతిని అందజేస్తానని చెప్పారు. 2015 వ సంవత్సరంలో జాతీయ బోర్డు ఫర్ డిజిబుల్ క్రికెట్ వారి ఆహ్వానం మేరకు ఫైనల్స్ కు విచ్చేసిన క్రీడాకారుల జట్లకు పవన్ కళ్యాణ్ 25 లక్షల ప్రైజ్ మనీ ప్రకటించారని గుర్తు చేశారు. జై ఆఫ్ గివింగ్ అని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు.
