

గూడూరు, మన న్యూస్: తిరుపతి జిల్లా గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రవి హోమ్ నీడ్స్ అధినేత రవికుమార్ దాతృత్వంలో ఆసుపత్రికి వచ్చిన నిరుపేద గర్భిణీ స్త్రీలకు వెజిటబుల్ రైస్, గుడ్డు, అరటిపండులను ముఖ్య అతిథి డాక్టర్ షరీనా చేతుల మీదుగా పంపిణీ చేయడమైనది. డాక్టర్ షరీనా గారు మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక వారు గత 11 సంవత్సరముల నుండి నిరంతరాయంగా మా ఆసుపత్రికి వచ్చే పేద గర్భిణీ స్త్రీలకు భోజనాలు పంపిణీ చేస్తున్నారని మరియు కోవిడ్ టైంలో కూడా 120 ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చారని బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెట్టారని మా ఆసుపత్రి సిబ్బందికి ప్రోవిజన్స్ కూడా పంపిణీ చేశారని ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న జే.వి.వి సభ్యులందరికీ మా ఆసుపత్రి సిబ్బంది తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. గర్భిణీ స్త్రీలు కూడా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకొని మంచి ఆరోగ్య కరమైన బిడ్డకు జన్మనియాలని కోరారు. ఈ కార్యక్రమంలో జే.వి.వి. అధ్యక్షులు వేగూరు రాజేంద్రప్రసాద్, నాగరాజు, చెంచు నారాయణ, పురుషోత్తమరావు, సుబ్బారావు, రజనీకాంత్, ఇబ్రహీం, సురేష్, అరుణ్ కుమార్, సాయి తదితరులు పాల్గొన్నారు.