

గూడూరు, మన న్యూస్ : స్థానిక ఒకటవ పట్టణ పరిధిలో ఉన్న నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏబీవీపీ 77వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల సమక్షంలో ఏబీవీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ పూర్వ జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ అని నిరంతరం విద్యార్థుల కోసం పనిచేస్తూ విద్యార్థులలో దేశభక్తిని పెంపొందిస్తుంది అన్నారు. భగత్ సింగ్ వివేకానంద చంద్రశేఖర్ ఆజా ఝాన్సీ లక్ష్మీబాయి ఇటువంటి వ్యక్తిత్వాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళుతుంది అన్నారు. పూర్వ రాష్ట్ర కార్యదర్శి మన్నూరు మల్లికార్జున మాట్లాడుతూ వివేకానందుని మాట ఏబీవీపీ బాట అని భరతమాతను విశ్వ గురువు చేయడం కోసం విద్యార్థి పరిషత్ గత 77 సంవత్సరాలుగా విద్యార్థులలో పని చేస్తుంది అన్నారు. కేవలం విద్యార్థుల సమస్యల పరిష్కారం మాత్రమే కాకుండా విద్యార్థులలో జాతీయ భావాలు పెంపొందించి తద్వారా సమాజంలో మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దే ప్రయత్నం విద్యార్థి పరిషత్ చేస్తుంది అన్నారు. దేశ్ కి రక్ష కౌన్ కరేగా కవున్ కరేగా హం కరేగా, భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలతో కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీకాంత్ గారు పూర్వ కార్యకర్తలు మనోహర్ శివశంకర్ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
