ప్రసన్న కుమార్ రెడ్డి ని వెంటనే అరెస్టు చేయాలి తెలుగు మహిళలు డిమాండ్.

గూడూరు, మన న్యూస్ కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి మీద అసభ్యకర వాఖ్యలు చేసిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని వెంటనే అరెస్టు చెయ్యాలికోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన తిరుపతి పార్లమెంట్ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం.శ్రావణి రెడ్డి.నల్లపురెడ్డి కుటుంబానికి ప్రసన్నకుమార్ రెడ్డి కళంకం తెచ్చాడు.సమాజానికి మంచి చేస్తూ, సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న వేమిరెడ్డి కుటుంబం పై ఇలాంటి అసభ్య పదజాలాలతో వ్యాఖ్యలు చేయడం దారుణం.ప్రజా ప్రతినిధులుగా ఇలాంటి భాష ఎవరన్నా వాడుతారా, దేవతలా పూజించాల్సిన మహిళల పై అనుచిత వ్యాఖ్యలు చేయడం నీచాతి నీచం.తల్లిని, చెల్లిని గాలికి వదిలేసిన వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి లక్షణాలను నియోజకవర్గాల్లో నేతలు అలవర్చుకున్నారు, మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడడం వైకాపా నాయకుల డీఎన్ఏ లో ఉంది,ఆ పార్టీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి దగ్గర నుండి నేడు ప్రసన్నకుమార్ రెడ్డి దాకా ఇదే తీరు.రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం, వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లి అసభ్య పదజాలాలు వాడడం వైసిపి నేతలకే చెల్లుతుంది.దేవాలయం లాంటి అసెంబ్లీ లో మహిళలను కించపరుస్తూ బూతులు మాట్లాడిన నీచ చరిత్ర ఈ వైకాపా నాయకులది,ఒక మహిళ చేతిలో ఓటమి ప్రసన్నకుమార్ రెడ్డి జీర్ణించుకోలేక పోతున్నాడు.ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు మీ బూతుల పాలన అవినీతి పాలన చూసి ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అయినా మీ బుద్ధి మారలేదు. ప్రశాంతి రెడ్డి గారికి అన్ని విధాలుగా అండగా ఉంటాం అని, ప్రసన్నకుమార్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి లేకపోతే మహిళల చేతిలో చెప్పు దెబ్బలు ఖాయమని మట్టం. శ్రావణి రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి లీలావతి, రూరల్ అధ్యక్షురాలు మల్లి.శ్యామల,మాజీ కౌన్సిలరు కల్పన,సుబ్బమ్మ,విజయమ్మ,అంకమ్మ పాల్గొన్నారు.

Related Posts

కలిగిరి వైద్యాధికారిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయండి ఎంపిపి మెట్టుకూరి శిరీషా రెడ్డి..!!!

కలిగిరిమన న్యూస్ : కలిగిరి ప్రాథమిక వైద్యశాల డాక్టర్లపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని కలిగిరి మండల అధ్యక్షురాలు ముట్టుకూరు శిరీష రెడ్డి ఎంపీడీవో ప్రత్యూషను కోరారు. కలిగిరి మండల సర్వసభ్య సమావేశం బుధవారం ఉదయం 11:30 నిమిషాలకు కలిగిరి ఎంపీడీవో…

మండల సమావేశాలకు సభ్యులు రారు,, అధికారులు లేరు ??

కలిగిరిమనన్యూస్ : బుధవారం జరిగిన కలిగిరి మండల సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా జరిగింది. సర్వసభ్య సమావేశానికి 23 మంది సర్పంచులు, 13 మంది ఎంపీటీసీలు, ఒక కోఆపషన్ సభ్యులు, జెడ్పిటిసి సభ్యులు, అధిక సంఖ్యలో అన్ని శాఖల అధికారులు పాల్గొనాల్సి ఉంది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కలిగిరి వైద్యాధికారిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయండి ఎంపిపి మెట్టుకూరి శిరీషా రెడ్డి..!!!

కలిగిరి వైద్యాధికారిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయండి ఎంపిపి మెట్టుకూరి శిరీషా రెడ్డి..!!!

మండల సమావేశాలకు సభ్యులు రారు,, అధికారులు లేరు ??

మండల సమావేశాలకు సభ్యులు రారు,, అధికారులు లేరు ??

గర్భిణీ స్త్రీలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి – వైద్యుల హితవు

గర్భిణీ స్త్రీలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి – వైద్యుల హితవు

విద్యార్థులలో గురుభక్తితో పాటు జాతీయ సమైక్యతను పెంపొందించాలి — ఎం.ఈ.ఓ కత్తి శ్రీనివాసులు

విద్యార్థులలో గురుభక్తితో పాటు జాతీయ సమైక్యతను పెంపొందించాలి — ఎం.ఈ.ఓ కత్తి శ్రీనివాసులు

లేబర్ కోడ్స్ రద్దు చెయ్యాలి — కార్మిక సంఘాల డిమాండ్

లేబర్ కోడ్స్ రద్దు చెయ్యాలి — కార్మిక సంఘాల డిమాండ్

రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు – ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ విజ్ఞప్తి

రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు – ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ విజ్ఞప్తి