కలెక్టర్ ఏ శ్యాం ప్రసాద్ ఆదేశాలతో పురుగులు మందు కంపెనీ పై దర్యాప్తు ముమ్మరం

మన న్యూస్ పార్వతీపురం జులై 5:- పార్వతిపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో ఇప్పటికైనా పురుగులు మందు ఫ్యాక్టరీ పై ఉన్న అభియోగాలు పైన పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి పంచాయితీ ప్రజలకు నిజ నిజాలు తెలియజేసి పంచాయతీ ప్రజలకు భరోసా కల్పించాలి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరపున అధికారులకి విన్నవించుకున్నాము, ఈ సందర్భంగా గంగరేగివలస ఎంపీటీసీ గంట వెంకట్ నాయుడు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి రైతులు అందరితో కలిసి పత్రిక విలేకరులతో మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగ రేగివలస పంచాయతీ పరిధిలో ఏడు సంవత్సరాల క్రితం ప్రారంభించిన పురుగుల మందు ఫ్యాక్టరీ ప్రారంభించిన కన్నా ఇప్పుడు ఎక్కువ దిగుమతి చేస్తున్నారని అలాగే కలుషితమైన విష వాయు వ్యర్ధపదార్థాలు చెరువులో వదిలేస్తున్నారని దీనివల్ల పొలాల్లో బోర్ లో ఉన్న నీరు కలుషితం అవుతుందని అలాగే విపరీతమైన దుర్వాసన వస్తుందని దీనివల్ల ఇప్పటికీ గంగిరేయవలసలో పంచాయతీ పరిధిలో గంగిరేగివలస సోమినాయుడు వలస గ్రామంలో 12 మంది వరకు వివిధ రకాల క్యాన్సర్ వ్యాధితో చనిపోవడంతో పాటు ఇంకా కొంతమంది వివిధ రకాల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని ఇంత జరుగుతుంటే వైద్య శాఖ అధికారులు మాత్రం ముగ్గురు కు మాత్రమే క్యాన్సర్ వ్యాధి వలనచనిపోయారని చెప్పడం చాలా విడ్డూరం ఉందని కాబట్టి ఇలాంటి సందర్భంలో పురుగులు మందుపై వస్తున్న విభిన్న అభియోగాలపైన వెంటనే పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి నిజ నిజాలు తేల్చాలని కోరుతూ కలెక్టర్ కి గ్రీవెన్స్ లోను పురుగుల మందు ఫ్యాక్టరీ పై సిపిఎం పార్టీ ఇతర ప్రజా సంఘాలు మరియు గంగ రేగివలస రైతులు కలిసి పత్రికా ప్రకటనతో పాటు జేడీ కి జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదులు ఇచ్చిన మేరకుఈరోజు అనగా శనివారం కలెక్టర్ స్పందించి వారి యొక్క ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ తాసిల్దార్ సిహెచ్ సత్యనారాయణ వైద్యశాఖ అధికారి డిఎంహెచ్ఓ పద్మావతి పోలీస్ సిబ్బంది రైటర్ నాగరాజు నీటిపారుదల శాఖ జేఈ అభిషేక్ అలాగే పొల్యూషన్ అధికారి ఫ్యాక్టరీ వద్దకు వచ్చి అన్ని విధాలుగా పరిశీలించడం జరిగిందని అయితే పైన తెలిపిన అన్ని శాఖల అధికారులు పూర్తిస్థాయిలో ఈ ఫ్యాక్టరీ కి సంబంధించిన అన్ని రకాల అనుమతులు పరిశీలించిన తర్వాత వాటి యొక్క నివేదిక రైతుల యొక్క అభిప్రాయాన్ని సేకరించి ఈ నివేదికలన్నీ వారం రోజుల్లో జిల్లా కలెక్టర్ కి పంపిస్తామని కొమరాడ తాసిల్దార్ రైతులకు చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా గంగ రేగివలస గ్రామ సమీపంలో ఉన్న పురుగులు మందు కంపెనీపై వస్తున్న అన్ని విధాల ఆరోపణలపై పూర్తిస్థాయిలో పుల్ స్టాప్ పడే విధంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా ఇకనైనా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి సంబంధించిన నివేదికలన్నీ గ్రామ సభల ద్వారా పంచాయతీ ప్రజలకు తెలియజేయాలని అలాగే చెడ్డకు, అడ్డంగా గొయ్యి ఇరిగేసిన అధికారులు తవ్వేయడం చాలా అన్యాయమని ఈ విషయాన్ని తాసిల్దార్ సిహెచ్ సత్యనారాయణ దృష్టికి రైతులు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తీసుకెళ్లగా వెంటనే తాసిల్దార్ ఇరిగేషన్ జేఈ తో మాట్లాడి ఈ గొయ్య కప్పేయాలని ఎందుకంటే ఈ వర్షాకాలంలో రైతులకు అవసరం కాబట్టి ఈ గొయ్యి కప్పేయాలని ఇరిగేషన్ జేఈ కి తాసిల్దార్ చెప్పడం జరిగింది, కాబట్టి ఇలాంటి సందర్భంలో రైతులు చేస్తున్న పోరాటానికి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పూర్తిగా మద్దతు ఉంటుందని అలాగే ఇప్పటికే క్యాన్సర్ వ్యాధితో చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసి ఇవ్వాలని అలాగే సోమినాయుడు వలస గంగ రేగువలస గ్రామంలో క్యాన్సర్ తో బాధపడుతున్న వారి కుటుంబాలకు అన్ని విధాలుగా భరోసా కల్పించాలని ఈ సందర్భంగా అటు జిల్లా కలెక్టర్ కి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో రైతులు మరిచర్ల సింహాసలం మరిచర్ల సత్యనారాయణ గంగ రేగువలస గ్రామానికి చెందిన రైతులు పాల్గొన్నారు.

Related Posts

సాలూరులో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు,

మన న్యూస్ సాలూరు జూలై 6:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో ఆంధ్ర చెస్ అసోసియేషన్ వారు ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నందు, స్థానిక ఆర్యవైశ్య ధర్మశాల లో ఈరోజు ఆదివారం రాష్ట్రస్థాయి 16 సంవత్సరాల లోపు బాల…

అనంతపురంలో బీజేపీకి బలమేర్పడుతోంది: భూతపూర్వ BSF అధికారి కాశీ నాగేంద్ర బీజేపీలో చేరారు

అనంతపురం, జులై 6 (మన న్యూస్): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశ అభివృద్ధికి సాకారమవుతున్న కృషిని, ప్రజల సేవా ఉద్యమాన్ని ప్రశంసిస్తూ భూతపూర్వ BSF అధికారి కాశీ నాగేంద్ర భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. జిల్లా బీజేపీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సాలూరులో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు,

సాలూరులో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు,

అనంతపురంలో బీజేపీకి బలమేర్పడుతోంది: భూతపూర్వ BSF అధికారి కాశీ నాగేంద్ర బీజేపీలో చేరారు

అనంతపురంలో బీజేపీకి బలమేర్పడుతోంది: భూతపూర్వ BSF అధికారి కాశీ నాగేంద్ర బీజేపీలో చేరారు

యువకవి అంజనాద్రికి మాజీ మంత్రి రోజా అభినందనలు

యువకవి అంజనాద్రికి మాజీ మంత్రి రోజా అభినందనలు

శ్రీశైలం నీటి విడుదల, హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఆందోళనరాయలసీమ ప్రతినిధులను ‘కళ్ళులేని కబోదులు’గా న్యాయవాది కృష్ణమూర్తి ఆరోపణ

శ్రీశైలం నీటి విడుదల, హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఆందోళనరాయలసీమ ప్రతినిధులను ‘కళ్ళులేని కబోదులు’గా న్యాయవాది కృష్ణమూర్తి ఆరోపణ

ఘనంగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయులు జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయులు జన్మదిన వేడుకలు

పీర్లకు వెండి గుర్రం, శంకు-చక్రాలను అందించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి

పీర్లకు వెండి గుర్రం, శంకు-చక్రాలను అందించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి