

మన న్యూస్,తిరుపతి, :– కూటమి ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ తెలిపారు. శుక్రవారం 24 డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్ లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని క్లస్టర్ ఇంచార్జ్ బుల్లెట్ రమణ, టిడిపి నగర మాజీ అధ్యక్షులు
జె డబ్ల్యూ విజయ్ కుమార్ ల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సుగుణమ్మ తో పాటు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, కేంద్ర మాజీ మంత్రి వనబక లక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమ పోస్టర్లను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ను ప్రారంభించినట్లు చెప్పారు. అలాగే నిరుద్యోగ యువతకు మృతి త్వరలో ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన పేదలందరికీ సూపర్ సిక్స్ పథకాలు సమర్థవంతంగా అమలు అవుతాయని చెప్పారు. ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి పై ఇంటింటికి వెళ్లి తెలియజేశారు. రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, డిసిసిబి బ్యాంక్ చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి, టిడిపి నగర బీసీ సెల్ అధ్యక్షులు విశ్వనాథం,వార్డ్ ప్రెసిడెంట్ ఆనంద్,వార్డ్ సెక్రటరీ త్యాగరాజు,రాణెమ్మ,గంగ రాణి,పుష్పలత,ప్రేమ కుమార్, అల్లా భాష, జె.విజయ్ కుమార్,శేష గిరి రావు,యం.బాల సుబ్రమణ్యం,ధన,దిలీప్ కుమార్,గంగాధరం టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.