సాలూరు, Mana News :– విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టు పట్ల దురుసుగా ప్రవర్తించిన టు-టౌన్ ఎస్ఐ మురళి పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని సాలూరు ప్రెస్ క్లబ్ డిమాండ్ చేసింది. శనివారం ఉదయం పట్టణ ప్రెస్ క్లబ్ కార్యదర్శి ఆల్తి మధు, క్లబ్ పూర్వ అద్యక్షులు బంకురు శ్రీనివాస రావుల ఆధ్వర్యంలో సమావేశమైన విలేఖర్లు విజయనగరం 10టివి స్టాఫ్ రిపోర్టర్ ఎం.ఎం.ఎల్ నాయుడు విధి నిర్వహణలో ఉండగా టూ-టౌన్ ఎస్ఐ మురళి వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు. ఎస్ఐకి ఏదైనా అభ్యంతరం ఉంటె తన అభిప్రాయాన్ని తెలియజెయ్యలే తప్ప అధికార దర్పాన్ని ప్రదర్శించే విధంగా దౌర్జన్యం చెయ్యటం, బలవంతంగా సెల్ తీసుకోవటం సహించరాని విషయాలుగా అంతా అభిప్రాయ పడ్డారు. ఇటువంటి వ్యక్తి పై సంబంధిత ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, అప్పుడే పోలీసు వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం, గౌరవం కలుగుతాయన్నారు. అనంతరం ప్రెస్ క్లబ్ సభ్యులు నల్లి శ్రీను, ఆరంగి సీతారాం, సుబ్రహ్మణ్యం, మోహన్, గుప్త, తవిటి నాయుడు, దేవేంద్ర, ప్రశాంత్, విశ్వేశ్వర రావు తదితరులు తహశీల్దార్ నీలకంఠరావుకి వినతి పత్రాన్ని అందజేసారు. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితుల్లో విలేఖరుల పై జరుగుతున్న దాడులు, తాజాగా విజయనగరం 10టివి స్టాఫ్ రిపోర్టర్ కి ఎదురైన చేదు అనుభవాన్ని వివరించారు. తమ డిమాండును జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *