మన న్యూస్ సింగరాయకొండ:-

శ్రీ చైతన్య టెక్నో స్కూల్, శింగరాయకొండలో 7వ తరగతి చదువుతున్న దేవినేని భవ్యశ్రీ భారత్ ఆర్ట్స్ అకాడమీ, హైదరాబాద్ తరపున నిర్వహించిన “ది లార్జెస్ట్ కూచిపూడి నృత్యం” కార్యక్రమంలో పాల్గొని వరల్డ్ గిన్నిస్ రికార్డు సాధించి తన పేరును నమోదు చేసుకుంది.ఈ విషయాన్ని స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ బి. లక్ష్మణ్ గారు ప్రకటించారు. భవ్యశ్రీకి ఈ ఘనత లభించిన సందర్భంగా ఆమె తల్లిదండ్రులను, విద్యార్థినిని ఉపాధ్యాయులు అభినందించారు.కార్యక్రమంలో పాఠశాల డీన్ శ్రీనివాసులు, ప్రైమరీ ఇన్ఛార్జి అమరవేణి, భవ్యశ్రీ తండ్రి దేవినేని బాలాజీ ఇతరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *