• వైసీపీ కో ఆర్టినేటర్ ముద్రగడ గిరి బాబు

శంఖవరం/ రౌతులపూడి మన న్యూస్ (అపురూప్) రెడ్ బుక్ పేరుతో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అని వైసీపీ పార్టీ ఆవిష్కరించిన పుస్తకాన్ని మండల కన్వీనర్ చింతకాయల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు హాజరై వైసీపీ పార్టీ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పై ఆవిష్కరించిన ఆవిష్కరించిన పుస్తకాన్ని గిరిబాబు ఆవిష్కరించారు. గిరిబాబు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ది నమ్మకమైన పాలన అయితే చంద్రబాబుది నయవంచన పాలన అని విమర్శించారు. గత ప్రభుత్వం హాయంలో పేదల సంక్షేమం సమగ్రాభివృద్ధి జరిగితే ప్రస్తుత కూటమి పాలనలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, వాసిరెడ్డి జమీల్, వైస్ ఎంపీపీ సాయి, వాసిరెడ్డి భాస్కర బాబు, కాకి నాని, సర్పంచ్ లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *