• కాకి నాని పదవి తో ఏ. మల్లవరం లో సంబరాలు
  • మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీ శివ కుమారి

శంఖవరం/రౌతులపూడి మన న్యూస్ (అపురూప్) :- రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా రౌతులపూడి మండలం ఏ మల్లవరం గ్రామానికి చెందిన కాకి లక్ష్మణ మూర్తి (నాని) నియమితులవడం పట్ల నాని తన స్వగ్రామమైన ఏ మల్లవరం గ్రామంలో నాని నివాసంలో కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. కాకి లక్ష్మణరావు (నాని ) రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమారి నాని నివాసంలో నానికి శాలువ వేసి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. నాని నివాసంలో లక్ష్మి శివకుమారి మాట్లాడుతూ మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, ప్రత్తిపాడు నియోజకవర్గానికి వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబును ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలన్నారు. మారుమాల గ్రామమైన ఏ మల్లవరం గ్రామంలో స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి నన్ను ఎమ్మెల్సీగా పదవి ఇచ్చి చట్టసభలకు పంపించారని, ఇదే గ్రామం నుండి నానిని వైయస్ జగన్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి ముద్రగడ, వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ఆదేశాలతో నానిని నియమించడం సంతోషకరమన్నారు. మా గ్రామం నుండి ఎంతోమంది రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా ఉన్నత స్థాయికి చేరుకున్నారని మా గ్రామ ప్రజలు మాపై చూపిస్తున్న అభిమానం మరవలేనిది అన్నారు. ఈ పదవులు రావడానికి మల్లవరం గ్రామ ప్రజలే కారణమని ప్రజలు ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకు అందించాలన్నారు. ఈ కార్యక్రమం లో అంబేద్కర్ ఇండియా మిషన్ కాకినాడ జిల్లా అధ్యక్షురాలు కొంకిపూడి రాజ్యలక్ష్మి దళిత ప్రజా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గునపర్తి అపురూప, దళిత ప్రజా సమితి కాకినాడ జిల్లా అధ్యక్షులు బత్తిన తాతాజీ మాజీ సర్పంచ్ నాకిరెడ్డి అప్పలనాయుడు, బీమిరెడ్డి రామకృష్ణ, గవిరెడ్డి రాజబాబు, పలివెల శివ, అడిగర్ల సత్తిబాబు,కాకి పెదకాపు, కాకి వీర సత్యనారాయణ, లోకవరుపు ఏసుబాబు, నాకిరెడ్డి గోవింద్, బొడ్డు నాని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *