శంఖవరం మన న్యూస్ (అపురూప్) : కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి నరసింహమూర్తి (బుజ్జి) సోదరుడు సుబ్రహ్మణ్యం కుమార్తె వైష్ణవి నీట్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 532 వ ర్యాంక్ ఈడబ్ల్యూఎస్ లో 33 వ ర్యాంక్ సాధించి ప్రతిభను కనబరిచారు. సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పర్వత సురేష్ పెద్దనాపల్లి గ్రామంలో వైష్ణవి నివాసానికి వెళ్లి అభినందించి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో బొర్రా వాసు, బొర్రా వరప్రసాద్, జట్లా శ్రీను, పడాల కృష్ణ మూర్తి, దాసరి రాఖీ,మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *