విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం..బగ్గుమన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: బగ్గుమన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్
భయంతో పరుగులు తీసిన స్థానికులు
ఏలేశ్వరం ప్రధాన రహదారిలో పాత బస్టాండ్ వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుండి ఒకసారిగా మంటలు చల్లరేగాయి. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయి.ఏలేశ్వరం ప్రధాన రహదారిలో ప్రతినిత్యం రద్దీ గుండె పాత బస్టాండ్ సెంటర్లో విద్యుత్ వినియోగం కోసం మూడు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. బుధవారం మధ్యాహ్నం ట్రాన్స్ఫార్మర్ నుండి ఒక్కసారిగా మంటలు రావడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా ఒకసారిగా ఉలిక్కిపడి పరుగులు తీశారు. హఠాత్తుగా చెలరేగిన మంటలకు ట్రాన్స్ఫార్మర్ పేలిపోతుంది ఏమో అన్ని భయంతో ఒకరినొకరు తొక్కుకుంటూ తమ వాహనాలు వదిలి పరుగులు తీశారు.ఈ ట్రాన్స్ఫార్మర్లకు కుత దూరం మద్యం షాపు మరోవైపు టీ టైం రద్దీగా ఉన్నాయి. సాయంత్రం కావడంతో ఓవైపు మద్యం ప్రియులు మరో వైపు చాయ్ ప్రియులు గుమ్మిగూడు ఉన్నారు. పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ లో మంటలు రావడంతో అదిరిపాటుగా ఉన్న వారంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. మరికొంతమందికి అయితే ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయం స్థితిలో ఉండిపోయారు. కాగా విద్యుత్ శాఖ అధికారులు ఒకరోజు ముందే ఈ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసినట్లు తెలిసింది.ఒక రోజులోనే ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు రావడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ సిబ్బంది స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని ఇసుకతో మంటలను అదుపు చేశారు. దీనితో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.కాగా విద్యుత్ ప్రమాదాలకు దారి తీస్తున్న సంఘటనలు పరిశీలిస్తే విద్యుత్ అధికారులు వైఫల్యాలు ఎక్కువ కనబడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎక్కడ చూసినా వేలాడుతూ తెగిపడిన వైర్లు,విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి నిదర్శనాలుగా కనబడుతున్నాయి.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!