గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

మన న్యూస్ : బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన యంగ్ హీరో గౌతమ్ తాజా చిత్రం ‘సోలో బాయ్’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నవీన్ కుమార్ దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా మెరవనున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో పోసాని కృష్ణ మురళి, అనిత చైదరి, అరుణ్ కుమార్, ఆర్కే మామ, షఫీ, డాక్టర్ భద్రం వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘సోలో బాయ్’ ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్ సినీ లవర్స్‌ను ఆకర్షిస్తున్నాయి. తాజాగా రిలీజైన పోస్టర్‌లో గౌతమ్.. రమ్య పసుపులేటితో కలిసి కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. ఈ పోస్టర్ యూత్‌లో హైప్ క్రియేట్ చేస్తోంది. మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని జూలై 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. యూత్‌ఫుల్ కథతో, రొమాంటిక్ వైబ్‌తో, ఎంటర్‌టైన్‌మెంట్ డోస్‌తో ఈ సినిమా ప్రేక్షకులను ఫుల్ ఎంగేజ్ చేయనుంది. గతంలో ‘ఆకాశ వీధుల్లో’ చిత్రంతో ఆకట్టుకున్న గౌతమ్ మరోసారి హీరోగా ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడో చూడాలి!నటీనటులు – గౌతమ్ కృష్ణ, శ్వేతా అవస్థి, రమ్య పసుపులేటి, పోసాని కృష్ణ మురళి, అనితా చౌదరి, షఫీ, ఆర్కే మామ, భద్రమ్, ఆనంద్ చక్రపాణి, సూర్య, ల్యాబ్ శరత్, అరుణ్ కుమార్, రజినీ వర్మ తదితరులుసాంకేతిక బృందం:కాస్ట్యూమ్స్ – రిషిక, వీణాధరిసినిమాటోగ్రఫీ – త్రిలోక్ సిద్ధుసంగీతం – జుడా సంధ్యకో-డైరెక్టర్ – కినోర్ కుమార్ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ – SK నయీమ్లిరిక్ రైటర్స్ – శ్యామ్ కాసర్ల, పూర్ణా చారి, చైతన్య ప్రసాద్, కళ్యాణ్ చక్రవర్తికొరియోగ్రాఫర్: ఆటా సందీప్బ్యానర్ – సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్నిర్మాత – సెవెన్ హిల్స్ సతీష్ కుమార్దర్శకత్వం – పి. నవీన్ కుమార్పి ఆర్ ఓ : మధు VRడిజిటల్ : డిజిటల్ దుకాణం

Related Posts

మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!!

Mana News, Mana Cinema :-తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారికకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు కేటగిరిలో గద్దర్ అవార్డ్స్ వరించడం విశేషం. సాయి సిద్ధార్ద్…

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

  • By JALAIAH
  • September 10, 2025
  • 4 views
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

  • By JALAIAH
  • September 10, 2025
  • 5 views
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..