

Mana News :- శేరిలింగంపల్లి(నవంబర్ ):- బూత్ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే వారిని బూత్ అధ్యక్షులగా నియమించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్, మసీద్ బండ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ముఖ్య అతిథిగా జిల్లా రిటర్నింగ్ అధికారి సుభాష్ చందర్ హాజరయ్యారు.ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగుస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో బూత్ అధ్యక్షుల నియామకం ఉంటుందని ,వారిని ఎన్నుకునే ప్రక్రియ విధానం గురించి వివరించడం జరిగింది,అలాగే బూత్ అధ్యక్షులుగా కార్యకర్తలకు ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటారో అలాంటి వారినీ నియమించాలని కోరిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ . ఈ కార్యక్రమంలో కన్వీనర్ రాఘవేంద్రరావు, కో కన్వీనర్ మణి భూషణ్, ఇంఛార్జి మహిపాల్ రెడ్డి, రాష్ట్ర నాయకులు రవీందర్ రావు, బాల్ద అశోక్, వసంత్ కుమార్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు ఆంజనేయులు సాగర్, కృష్ణ ముదిరాజ్, నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, నవీన్ గౌడ్, డివిజన్ నాయకులు, పాల్గొన్నారు.