

Mana News :- శేరిలింగంపల్లి (నవంబర్ 21) :- నాలా విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే గాంధీ అధికారులను ఆదేశించారు.శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ పరిధిలోని గఫుర్ నగర్ కాలనీ జంక్షన్ నుండి దుర్గం చెరువు వరకు సైబర్ హిల్స్ నుండి వయా జనార్దన్ హిల్స్ యూరో కిడ్స్ స్కూల్ వరకు 25 కోట్ల 41 లక్షల రూపాయల అంచనావ్యయంతో చేపడుతున్న నాలా విస్తరణ పనులను గురువారం పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే గాంధీ ఆదిలాకారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో వరద నీరు కాలనీలను ముంచెత్తుతున్నాయని సమస్య శాశ్వత పరిష్కారం దిశగా పనులు చేపడుతున్నామని భవిష్యత్తు లో వరద సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకొని నాల విస్తరణ పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు.నాలా విస్తరణ పనులను పూర్తి చేసి వరదతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముంపు గురికాకుండా చూకోవాలన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట జిహెచ్ఎంసి అధికారులు డీఈ ఆనంద్ ,ఏఈ జగదీష్, కాంట్రాక్టర్ పీఎస్ రెడ్డి, తదితరులు ఉన్నారు