

Mana News :- శేరిలింగంపల్లి (నవంబర్ 21)మన న్యూన్ :- శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్, సోఫా కాలనీ చెందిన వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు,సీనియర్ నాయకులు,కాలనీ వాసులు గురువారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ని కార్పొరేటర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తమ కాలనీలో ఎన్నాళ్లుగానో ఉన్న డ్రైనేజీకి అవుట్ లెట్ సమస్య చర్యలు తీసుకోవాలని అసంపూర్తిగా మిగిలిపోయిన సి సి రోడ్డు,యూజీడీ పైప్ లైన్ నిర్మాణము పనులను పూర్తి చేయాలని,మంచి నీటి వసతిని ,మెరుగుపరచాలని విద్యుత్ సమస్యలను మరియు విధి దీపాలు సక్రమంగా పనిచేసేలా చూడలని,పారిశుధ్యం పనులు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ని కోరగా.. తక్షణమే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు.కాలనీ వాసులకు ఇబ్బందులు లేకుండా డ్రైనేజీకి అవుట్ లెట్ ను ఏర్పాటుచేసి, అందుకు కావలసిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతిపాదనలు సిద్ధం కాగానే నిధులు మంజూరు చేయించి త్వరగా పూర్తి చేసి ప్రజల కష్టాలు తీరుస్తామని తెలిపారు.అనంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ మాట్లాడుతూ పెరుగుతున్న జనాభా దృశ్య భూగర్భ డ్రెయినేజీ పైప్ లైన్ డయా పెంచి లెవల్స్ తో అనుసంధానం చేస్తూ ఒక్క కాలనీ నుండి మరొక కాలనీ కి మధ్యన ఇబ్బందులు తల్లెత్తకుండ పనులు ప్రణాళిక బద్దంగా అన్ని కాలనీలకు దశలవారీగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని.దశల వారిగా చెప్పటి పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణం పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, డ్రైనేజి వ్యవస్థను,మంచి నీటి వ్యవస్థను మెరుగుపరుస్తామని కార్పొరేటర్ తెలియచేసారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాజు నాయక్,శ్రీనివాస్, నరసింహ స్వామి, బాలకృష్ణ, వేంకటేశ్వర రెడ్డి, నారాయణ, కృష్ణ,లాల్ సింగ్,విజయ్,హీర్య,మోహన్ బాబు, వెంకటేష్ నాయక్, రాజు, సురేష్,గోపాల కృష్ణ, సత్యనారాయణ రాజు, కళ్యాణ్ నాయక్, రమేష్, హాసన్ భాయ్,ఎన్టీఆర్ నగర్, సోఫా కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.