

శ్రీరంగరాజపురం, మన న్యూస్ , మే 15: శ్రీరంగరాజపురం మండల కేంద్రంలో జరిగిన వైఎస్సార్సీపీ అభిమాని వివాహ మహోత్సవానికి మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ, “జీవితాంతం సుఖసంతోషాలతో, కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి” అని సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి చందు రాజు, కార్వేటినగరం సర్పంచ్ ధనుంజయ వర్మ, ఎస్.ఆర్. పురం ఎంపీపీ సరిత జనార్ధన్, స్థానిక సర్పంచ్ హరిత కుప్పయ్య, కార్వేటినగరం వైస్ సర్పంచ్ శేషాద్రి, పుల్లూరు ఎంపీటీసీ చంద్రశేఖర్, నాయకులు భాస్కర్, ముత్తు గన్, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది.