

మన న్యూస్ సింగరాయకొండ:- 2025-26 సంవత్సరానికి గాను అన్నదాత సుఖీభవ పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందని సింగరాయకొండ మండల వ్యవసాయ అధికారి వి. సుధాకర్ తెలియజేశారు. వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ఈ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ 14000 మరియు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ద్వారా అందజేస్తున్న రూ 6000 తో కలుపుకొని మొత్తంగా సంవత్సరానికి సాగు ఖర్చుల నిమిత్తం 20000 రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి అందజేయడం జరుగుతుందని తెలిపారు. దీనికి సంబంధించిన డేటా వెరిఫికేషన్ స్థానిక రైతు సేవ కేంద్రాలలోని గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా ఆన్లైన్ లోఅన్నదాత సుఖీభవ పోర్టర్లో నమోదు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ పథకం వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్ సాగుభూమి ఉన్న రైతులు అర్హులు అవుతారని తెలియజేశారు. అన్నదాత సుఖీభవ కు సంబంధించిన డేటా వెరిఫికేషన్ వ్యవసాయ మరియు రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతుందని తదుపరి డేటా వెరిఫికేషన్ ఆర్టిజిఎస్ పోర్టల్ లో రీవాల్యుయేషన్ అవుతుందని. ఆర్ టి జి ఎస్ ద్వారా పునః పరిశీలించిన రైతుల వివరాలను సంబంధిత స్థానిక రైతు సేవ కేంద్రాలకు పంపడం జరుగుతుంది చివరగా రైతులకు గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ కే వై సి నమోదు చేయడం జరుగుతుందని తెలియజేశారు. కనుక మండలంలోని ప్రతి రైతు వారి పరిధిలో గల రైతు సేవా కేంద్రాలలోని వ్యవసాయ సహాయకులు కలిసి వారి వారి వివరములు పరిశీలించుకోవాలని తెలియజేశారు.