

మన న్యూస్,తిరుపతి: తాతయ్యగుంట గంగమ్మ జాతరలో భాగంగా ఆదివారం మాతంగి వేషంలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. గాంధీపురం సర్కిల్ లో కార్పోరేటర్ ఎస్ కే బాబు ఆధ్వర్యంలో అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భక్తులకు అంబలిని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తనయుడు ఆరణి మదన్ పంపిణీ చేశారు. భక్తుల సౌకర్యార్థం ఎస్ కే బాబు అంబలి ఏర్పాటు చేయడం సంతోషకరమని ఆరణి మదన్ అన్నారు. నియోజకవర్గ ప్రజలకు మదన్ ముందస్తు గంగజాతర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ, కార్పోరేటర్లు నరసింహాచ్చారి, నరేంద్ర, తిరుత్తుణి వేణుగోపాల్, పాఠకం వెంకటేష్, రాజేష్ యాదవ్, బాలిశెట్టి కిషోర్, కుమార్, మల్లిశెట్టి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.