

మన న్యూస్,తిరుపతిః వేశాలమ్మ తల్లికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తనయులు ఆరణి మదన్ సారె సమర్పించారు. ఆదివారం సాయంత్రం భక్తుల కోళాహలం మధ్య పల్లెవీధిలోని రామాలయం నుంచి సారెను సంప్రదాయబద్దంగా తీసుకువచ్చి మదన్ దంపతులు వేశాలమ్మకు సమర్పించారు. అనంతరం ఆలయ ఈఓ మునిశేఖర్ వేశాలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేశాలమ్మకు సారె ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని ఆరణి మదన్ అన్నారు. స్థానికుల కొంగుబంగారంగా పూజలందుకునే వేశాలమ్మ ఆశిశ్శులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్పోరేటర్ సికే రేవతి, నాయకులు సునీల్ చక్రవర్తి, బొడ్డు అశోక్, కోదండ, ఆకేపాటి సుభాషిణీ ఉత్సవ కమిటీ సభ్యులు మునిరామయ్య, జశ్వంత్, రాహుల్ యాదవ్, శిరీషా, మల్లిశెట్టి లక్ష్మీ, రాధా, రుద్ర కిషోర్ తదితరలు పాల్గొన్నారు.