

మన న్యూస్, తిరుపతి : గంగ జాతరను పురస్కరించుకొని వేషాలమ్మ అమ్మవారికి ఆదివారం మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సారే సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు టౌన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ ఆర్ ముని రామయ్య, వేషాలమ్మ జాతర నిర్వహణ కమిటీ సభ్యులు అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి ఆర్ పీ శ్రీనివాసులు, మన్నూరు జయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
