Mana News :- నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని దేవరపాలెం గ్రామంలో ఈనెల 25వ తేదీ సాయంత్రం దేవరపాలెం నుండి తాడిపర్తి మెయిన్ రోడ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు బుధవారం పరిశీలించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారని అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రూరల్ లోని గ్రామీణ రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వేదగిరి నరసింహస్వామి దేవస్థానం ఆలయ మాజీ చైర్మన్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి తో పాటు పలువురు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *