

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 24: బద్వేల్ మున్సిపాలిటీలోని గ్రామీణ ప్రాంత సాధారణ విద్యార్థులతో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు పొన్నవోలు గోపిరెడ్డి ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ పొన్నవోలు బ్రహ్మానంద రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో భాగంగా పొన్నవోలు బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, తమ పాఠశాలలో 64 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే 64 మంది విద్యార్థులు పాసై 100% ఉత్తీర్ణత సాధించినట్లు తెలియజేశారు. తమ పాఠశాల విద్యార్థిని బి.స్రవంతి కి 591/600మార్కులు, వి. చేతన్ శ్రీధర్ రెడ్డి 588/600మార్కులు,సి.సుమ హర్షిణి 584/600 మార్కులు, ఎమ్.లోకేశవ కృష్ణ 582/600మార్కులు సాధించినట్లు తెలిపారు. పాఠశాలలో మొత్తం 64 మంది విద్యార్థులు గాను 31మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించినట్లు తెలియజేశారు. ఉపాధ్యాయుల నిరంతర కృషి, అత్యుత్తమ బోధనతో ఈ ఘన విజయాన్ని సాధించినట్లు తెలిపారు. ఇంతటి అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని ,విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ బ్రహ్మానంద రెడ్డి పలువురిని అభినందించారు.