

Mana News:– మారువేషన్లో పదిమంది వచ్చి అమాయకుల ప్రాణాలు బలితీసుకున్నంత మాత్రాన జాతి సమైక్యత ను దెబ్బ తీయలేరు. భాదితుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ దేశం మొత్తం ఈ రోజున ఐక్యతను స్ఫూర్తిని ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యతను గుర్తు చేసుకుంటూ ఈ మూడు రోజుల సందర్భంగా సంతాపం తెలుపవల్సిందిగా కోరుతున్నాం… అని జనసేన నాయకులు గునుకుల కిషోర్ అన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలననుసరించి జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ సూచనల తో జమ్మూ కాశ్మీర్ పహల్గామ్,బైసరన్ లో ఉగ్రవాద దాడిలో బలైన భారతీయులకు కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటిస్తూ జనసేన పార్టీ జిల్లా కార్యాలయం నెల్లూరు జిల్లా కార్యాలయం, గోమతి నగర్ నందు జనసేన జెండా అవనతం చేసి సంతాపం తెలియజేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఈ మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటి మూడు రోజులు సంతాప దినాలుగ ప్రకటించిన ఈ మూడు రోజులు అనగా ఈరోజు సాయంత్రం 6:00కి గాంధీ బొమ్మ సెంటర్ వద్ద క్యాండిల్ ర్యాలీ,రేపు సాయంత్రం అంబేద్కర్ విగ్రహం వద్ద కాండిల్ ర్యాలీ, శుక్రవారం సాయంత్రం అంబేద్కర్ బొమ్మ వద్ద మానవహారం తో సంతాపం తెలిపి జాతి స్పూర్తిని ముందుకు తీసుకువెల్లాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్,కిషోర్ గునుకుల,సుందర్ రామిరెడ్డి, జమీర్, శ్రీరామ్, కృష్ణారెడ్డి, రవి,కొట్టె వెంకటేశ్వర్లు, పావుజెన్ని చంద్రశేఖర్, హరిరెడ్డి,కాకు మురళి, నాగిశెట్టి మురళి, బిల్లా ఉదయ్, యాసీన్, పవన్, రాజేష్, వెంకట్, ఆబిద్,వెంకీ, తదితరులు పాల్గొన్నారు.