ఏప్రిల్ 25న థియేటర్స్ లో విడుదల కానున్న ”హలో బేబీ”

Mana News :- ఇటీవల సోలో క్యారెక్టర్ తో సినిమాలు బాగానే వస్తున్నాయి. సోలో క్యారెక్టర్ తో హలో బేబీ సినిమా ఏప్రిల్ 25న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. కాండ్రేగుల ఆదినారాయణ నిర్మాణంలో రామ్ గోపాల్ రత్నం దర్శకత్వంలో కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ అనే సినిమా తెరకెక్కింది. ఒక్క క్యారెక్టర్ తో హ్యాకింగ్ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రమణ కె సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు సుకుమార్.పి సంగీతం అందించారు. సాయిరాం తాటిపల్లి ఈ సినిమాకు ఎడిటర్. సరికొత్త కాన్సెప్ట్ తో హలో బేబీ సినిమా ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్, సాంగ్స్, ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన పురస్కార్ నంది అవార్డ్స్ వేడుకల్లో హలో బేబీ సినిమాలో నటించిన కావ్య కీర్తి నటనకు గాను పురస్కార్ నంది అవార్డు దక్కింది. ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ రాజేంద్ర, మహర్షి రాఘవ.. పలువురు ప్రముఖుల చేతుల మీదుగా కీర్తి కావ్య ఈ అవార్డు అందుకుంది.

Related Posts

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

మన న్యూస్ : బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన యంగ్ హీరో గౌతమ్ తాజా చిత్రం ‘సోలో బాయ్’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నవీన్ కుమార్ దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి