*తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన అర్చక స్వాములు..

తిరుపతి అక్టోబర్ 08.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వకుళమాత ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అర్చక స్వాముల సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపిన తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి ని అర్చకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా అర్చక స్వాములు డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి కి శాలువా కప్పి,వేదాశీర్వచనాలు అందించి,తీర్థప్రసాదాలు అందజేశారు.

ఆలయ అర్చకులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా,స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి చొరవ చూపినందుకు అర్చక బృందం ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *