

మన న్యూస్: చందానగర్ డివిజన్ పరిధిలోని సురక్ష హిల్స్ కిడ్జీ స్కూల్ కు అరుదైన గౌరవం దక్కింది.దేశంలోనే 2300 అధిక సెంటర్స్ తో కిడ్జి స్కూల్స్ కలిగి ఉన్న స్కూల్స్ లలోని 100 ఉత్తమ స్కూల్ లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన స్కూల్ లను ఎంపిక చేయగా చందానగర్ స్కూల్ కి అత్యుత్తమ నాణ్యమైన విద్య,బోధన,ఆట,పాటల్లో విద్యార్దులకు శిక్షణను అందిస్తున్నట్లు గుర్తించి ఉత్తమ స్కూల్ గా ఈ అవార్డును ప్రధానం చేశారు. ఆదివారం ముంబైలో జరిగిన కిడ్జీ స్కూల్ అవార్డుల ప్రధానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో చందానగర్ కిడ్జి స్కూల్స్ కరస్పాండెంట్ అండ్ కోఆర్డినేటర్,జితేందర్ తేజ్వాని, జూహి తేజ్వాని లు హాజరై ‘జీ’ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న కిడ్జీ స్కూల్ లల్లో చందానగర్ స్కూల్ ఒకటిగా నిలవడం తమకెంతో గర్వకారణంగా ఉందని కరస్పాండెంట్ అండ్ కోఆర్డినేటర్ జుహీ తేజ్వాని, జితేందర్ లు సంతోషం వ్యక్తం చేశారు.తమ కృషి అంకిత భావానికి అవార్డు వరించిందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.