

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని బీసీ వసతి గృహంలో ఎంఈఓ తిరుపతిరెడ్డి,తహసీల్దార్ బిక్షపతి, ఎంపీడీవో గంగాధర్ లు కలిసి విద్యార్థులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. వసతి గృహంలో 98 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు జతల ఏకరూప దుస్తులను పంపిణీ చేయడం జరిగింది అన్నారు. హాస్టల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవలన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం రామనారాయణ గౌడ్, ఇన్చార్జి వాడెన్ కృష్ణ,తదితరులు ఉన్నారు