మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు దంపతులు
స్వాతంత్ర్య సమరయోధులు, నవభారత నిర్మాత,
భారత దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జ
బాలల దినోత్సవం ఎమ్మెల్యే విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు..అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..
పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి రోజున బాలల దినోత్సవం జరుపుకుంటాం కాబట్టి మనమందరం వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు..
కుల,మత,వర్గ బేధాలు లేకుండా విద్యార్థులు అందరూ సోదర భావంతో మెలగాలని సూచించారు..
దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మాణం జరుగుతుంది
కాబట్టి.విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమని అన్నారు..
బాలల్ని సక్రమ మార్గంలో నడిచేలా చేస్తే దేశం కూడా అదే బాటలో పయనిస్తుందనడంలో సందేహం లేదని తెలిపారు..
నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వారి హక్కులను కాపాడటం, బాధ్యత గల పౌరులుగా వారిని తీర్చిదిద్దడం మన బాధ్యత అని అన్నారు..
బాలల హక్కులను కాపాడేందుకు సంకల్పం చేద్దాం. సామాజిక, ఆర్ధిక బలహీనతలు బాలల దరికి చేరకుండా వారికి మంచి భవిష్యత్ ను అందిద్దామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *