మన న్యూస్ కాకినాడ అపురూప్: కాకినాడ జిల్లా పోలీసు శాఖలో సుదీర్ఘ కాలం ఉద్యోగ విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన 1987 సంవత్సరానికి చెందిన ఎస్.ఐ., 1984, 1989 సంవత్సరాలకు చెందిన ఇద్దరు హోంగార్డులకు జిల్లా పోలీసు కార్యాలయంలో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సత్కరించి, అభినందించారు. ఎస్పీ ప్రభుత్వం నుండి రావాల్సిన ఉద్యోగ విరమణ ప్రయోజనాలను అతి త్వరగా ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు కార్యాలయ పరిపాలనా అధికారిని ఆదేశించడం జరిగింది. పదవీ విరమణ చేసిన అధికారుల భవిష్యత్తు జీవితం ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, కుటుంబ సభ్యులతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, పోలీస్ యూనియన్ సభ్యులు, పదవీ విరమణ చేసిన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *