జి బి కే ఆర్ ఎస్ టి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!

విద్యుత్ షాక్ కు గురైన బాధితుడికి పరామర్శ, అండగా ఉంటానని భరోసా..!

కాలనీలోని విద్యుత్ సమస్యను పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే..!

మనన్యూస్,వింజమూరు:పంచాయతీలోని జి బి కే ఆర్ ఎస్టి కాలనీలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ చేతులు మీదుగా అందజేశారు. స్థానిక మండల అధికారులు నాయకులతో కలిసి కాలనీలోని వికలాంగులు వితంతువు డయాలసిస్ పేషంట్ల పింఛన్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కాలనీవాసులు విద్యుత్ సమస్య ను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఆ సమస్యను పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అదేవిధంగా ఆ కాలనీలో విద్యుత్ షాక్ కు గురైన బాధితుడిని పరామర్శించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వైద్యం అందించాలని తెలియజేశారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలో ఇచ్చిన 4000 పింఛన్లను ప్రతి నెల ఒకటో తేదీన అందజేస్తున్నామని తెలిపారు. త్వరలోనే తల్లికి వందనం అందజేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని రోడ్లన్నీ యుద్ధ ప్రాతిపదికన వేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సారధ్యంలో యువనేత విద్యా శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి సర్పంచ్ నల్లగొండ సృజన మాజీ కన్వీనర్ గూడా నర్సారెడ్డి మాజీ సొసైటీ అధ్యక్షులు జూపల్లి రాజారావు సీనియర్ నాయకులు వనిపెంట సుబ్బారెడ్డి గువ్వల కృష్ణారెడ్డి బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ కదిరి రంగారావు ఎంపీటీసీ సభ్యురాలు యాకసిరి భవాని పట్టణ అధ్యక్షులు కోడూరు నాగిరెడ్డి వసంతరావు డేగ మధు యాదవ్ తిరుపతి ఆచారి ఎంపీడీవో శ్రీనివాసులురెడ్డి పంచాయతీ కార్యదర్శి శివకుమార్ సచివాలయం సిబ్బంది తదితరులు ఉన్నారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు