

మనన్యూస్,నారాయణ పేట:ఎలాంటి అనుమతులు లేని ఇసుక ట్రాక్టర్ ను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందని దామరగిద్ద ఎస్సై రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దామరగిద్ద పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయంత్రం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఎలాంటి అనుమతులు లేని ఇసుక టిప్పర్ ను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందని అన్నారు. అట్టి టిప్పర్ యొక్క ఓనర్ రమేష్, టిప్పర్ డ్రైవర్ వెంకటేష్ పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నమని తెలిపారు. ఎవరైనా అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ హెచ్చరించారు.
