

మనన్యూస్,మక్తల్:నియోజకవర్గం, బాలకృష్ణ
గ్రామపంచాయతీ కార్యాలయ అద్దాలను గుర్తు తెలియని ఆకతాయిలు గురువారం అర్ధరాత్రి ధ్వంసం చేసిన ఘటన నారాయణపేట జిల్లా నర్వ మండల పరిధిలోని లక్కర్ దొడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామపంచాయతీ కార్మికుడు వెంకటయ్య తెలిపిన వివరాలు.. శుక్రవారం ఉదయం విధులు నిర్వహించడానికి వచ్చిన కార్మికుడు అద్దాలు పగిలిపోవడం చూసి వెంటనే గ్రామపంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్ సమాచారం అందించారు. పంచాయతీ కార్యదర్శి ఆకతాయిలు చేసిన పనికి వారిపై నిఘా ఉంచి కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
