

మనన్యూస్,హయత్ నగర్:డివిజన్ పరిధిలోని పాత గ్రామం నందు ఉన్న చిన్న మసీదు నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మతాలకు అతీతంగా పండుగలు సామరస్యంగా జరుపుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డి,సీనియర్ నాయకులు మల్లేష్ ముదిరాజ్,భాస్కర్ సాగర్,అమీర్,నవీద్,హలీమ్, పలువురు నాయకులు,ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.
