మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు: నియోజకవర్గాల అభివృద్దే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ప్రత్తిపాడు నియోజకవర్గ టిడిపి శ్రేణులు మీడియాతో అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు అమరాది వెంకట్రావు,మండల ప్రధాన కార్యదర్శి జంకల ఫకీర్ మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ చొరవతో గ్రామంలో ఉన్న రోడ్ల అభివృద్ధికి 15.83 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నారని,అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గానికి భారీగా నిధులు కేటాయించి అభివృద్ధికి దోహదపడుతున్నారన్నారు. ఎమ్మెల్యే సత్యప్రభ కృషితో మునుపెన్నడు లేనివిధంగా నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కొమ్ముల కన్నబాబు,మంతెన వెంకటరమణ,లొండ లోవరాజు,దాకారపు కృష్ణ,పల్లా గోపి
తదితరులు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *