

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు: ప్రత్తిపాడు పోలీస్ స్టేషనుకి ప్రత్తిపాడు మండలం గజ్జెనపూడికి చెందిన సాగిరాజు అచ్యుతరామరాజు,అచ్చుతాయమ్మ మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా జిరాక్స్ మిషన్ ను ఎస్సై ఎస్ లక్ష్మి కాంతంకి దాట్ల ప్రసాదరాజు,దాకారపు కృష్ణ,
గొంప గంగరాజు,
పంపన శ్రీనివాస్,సింగిడి అప్పలకొండ,నీలి రాజబాబు చేతుల మీదుగా అందచేశారు.ఈ సందర్బంగా ఎస్సై లక్ష్మికాంతం వారిని అభినందించారు.ఈ సందర్బంగా ఎస్సై ఎస్ లక్ష్మికాంతం మాట్లాడుతూ పోలీస్ స్టేషనుకి జిరాక్స్ మిషన్ అవసరమని గుర్తించి అందించిన సాగిరాజు అచ్యుతరామరాజు,అచ్చుతాయమ్మ మెమోరియల్ ఫౌండేషన్ వారికి పోలీస్ స్టేషన్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని అన్నారు.ఫౌండేషన్ ద్వారా వచ్చి జిరాక్స్ మిషన్ అందించిన దాట్ల ప్రసాదరాజు,దాకారపు కృష్ణ,
గొంప గంగరాజు,పంపన శ్రీనివాస్
సింగిడి అప్పలకొండ,నీలి రాజబాబులని ఎస్సై ఎస్ లక్ష్మికాంతం ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో పీసీలు శివ తదితరులు పాల్గొన్నారు.